- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
భారత్-పాకిస్తాన్ సంబందాలంటేనే ఒక హాట్ టాపిక్, దీని గురించి మాట్లాడుతుంటే సమయమే తెలియదు, ఎందుకంటే ఈ టాపిక్ కు వున్న క్రేజ్ అంత మరి.
బహుశా ఈ రెండు దేశాలకు వున్న సంబంధాలు ఆలా వున్నాయి మరి. ఒక సరి అంత సరిగ్గా ఉన్నట్టు ఉంటుంది, మరొక సారి ఏమి బాగున్నట్టు ఉండదు, ఇలా ఎందుకు ఉంటుందో చాలామందికి తెలియదు.
ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక పోవడమే ఈ ఇండియా పాక్ రిలేషన్స్ కి అంత క్రేజ్ తెచ్చి పెడుతున్నాయేమో అని అనిపిస్తూవుంటుంది చాలా సార్లు.
నిజం చెప్పాలంటే ఒకప్పుడు అంతా భారతే ఉండేది, 1947 వరకు అంతా భారతే, 1947 నుంచే అంతా మారిపోయింది, భారత్ విభజన జరిగింది, హిందూస్తాన్, పాకిస్తాన్ ఏర్పాటు అయ్యాయి. ఆగష్టు 14న 1947లో పాకిస్తానుకు స్వతంత్రం వస్తే, భారత్కు ఆగష్టు 15న అదే సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. విభజన ఏమాత్రం సాఫీగా జరగలేదు, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది.
ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో దాదాపు 2 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు చెబుతూవుంటారు. విషయాలు అంతటితో ఆగలేదు, భారత్-పాకిస్తాన్ మధ్య రెండు యుద్దాలు జరిగాయి, భారత్లో ఎన్నో విధ్వంసక కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఈ ఇరు దేశాల మధ్య వున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి, అవి అనుకున్నంత మేరకు ఫలితనాలు ఇవ్వలేక పోయాయి.
ఇక్కడే మనకు పెద్ద ప్రశ్నలు ఎదురు అవుతాయి - ఇలా ఈ రెండు దేశాలకు మధ్య ఎందుకు జరుగుతుంది? సమస్యలకు పరిష్కారం ఎందుకు దొరకదు?
శాంతియుతంగా సమస్యలకు పరిస్కారం దొరకదా? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే, అసలు విషయాలు లోతుగా తెలియాలంటే కింద చెప్పబడే ఐదు పుస్తకాలు చదవాల్సిందే.
వీటిని ఎవరు చదవాలి?
అంతర్జాతీయ వ్యవహారాలు పైన మక్కువ ఉన్నవారు, ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి బాగా లోతుగా అధ్యయనం చెయ్యాలనుకువేవాళ్లు ఈ ఐదు పుస్తకాలను చదవవచ్చు. వీటిలో భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి అనేక విషయాలను తెలియచేయడం జరిగింది.
భారత్-పాకిస్తాన్ రిలేషన్స్ కు సంబంధించి 5 బుక్స్
1 మిడ్నైట్'స్ ఫ్యూరిస్: ది డెడ్లీ లెగసీ ఆఫ్ ఇండియా'స్ పార్టిషన్
ఈ పుస్తకాన్ని నిసీద్ హజారీ రచించారు, దీనిలో అసలు దేశ విభజన సమయంలో ఏమి జరిగింది అనే అందం పై వివరించడం జరిగింది. ఆ సమయంలో జరిగిన హింస, దానికి గల కారణాలు, ఈ విషయం పై రెండు వైపులా నాయకులూ ఏమి నిర్ణయాలు తీసుకున్నారు వాటి ప్రభావం భవిష్యత్తు లో ఇండియా పాకిస్తాన్ సంబంధాలపైన ఏ ప్రభావం చూపాయి అనే విషయాలు కూడా వివరించడం జరిగింది.
2 ది పీపల్ నెక్స్ట్ డోర్: ది క్యూరియస్ హిస్టరీ అఫ్ ఇండియా'స్ రిలేషన్స్ విత్ పాకిస్తాన్
ఈ పుస్తకాన్ని టీ సి ఏ రాఘవన్ రచించారు, ఇందులో 1947 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య అసలు ఏమి జరిగింది అనే విషయం పై ద్రుష్టి సారించడం జరిగింది. ఇండియా పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధాలు, శాంతి స్థాపన ప్రయత్నాలు, దీనికోసం జరిపిన రాయబారాలు వంటి అంశాలపై విశ్లేషణ వుంది. అసలు పార్టిషన్ తరువాత రెండు దేశాల మధ్య జరిగిన సంగీతనాలను ఇది వివరిస్తుంది.
౩ ఇండియన్ అండ్ పాకిస్తాన్: కంటిన్యూడ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ కోఆపరేషన్
స్టాన్లీ వాల్పర్ట్ రాసిన ఈ పుస్తకంలో భారత్ పాకిస్థాన్ల మధ్య ఉన్న అను ఉద్రిక్తతలు అంటే న్యూక్లియర్ టెన్సన్స్, స్ట్రాటజిక్ రైవల్రీ అంటే వ్యూహాత్మక ప్రత్యర్థిత్వం వంటి విషయాలను లోతుగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు దేశాలకు మధ్య జరిగిన కీలకమైన గొడవల గురించి యుద్ధాల గురించి చర్చిస్తుంది.
4 కాన్ఫ్లిక్ట్ అనెండింగ్: ఇండియా పాకిస్తాన్ టెన్సన్స్ సిన్స్ 1947
సుమిత్ గంగూలీ రాసిన ఈ పుస్తకంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలకు వున్నా శత్రుత్వానికి వెనక వ్యవస్థ పరమైన పాత్ర ఎంత వరకు ఉందనే విషయాన్ని పరిశీలిస్తుంది.
ముఖ్యంగా సైన్య వ్యవస్థ, కాశ్మీర్, రెండు దేశాల అన్తరరాజకీయాలు వంటి అంశాలకు రెండు దేశాల మధ్య వున్నా వైరుధ్యంలో ఎంత పాత్ర ఉందనే అంశాన్ని పరిశీలిస్తుంది.
రెండు దేశాల మధ్య వున్నా సమస్యలను పరిష్కరించడం ఎందుకు అంట సులువు కాదు అనే విష్యాయాన్ని కూడా పరిశీలిస్తుంది.
5 ఇండియా'స్ పాకిస్తాన్ కానన్డ్రమ్: మేనేజింగ్ అ కాంప్లెక్ రిలేషన్షిప్
శరత్ సభర్వాల్ ఈ పుస్తకాన్ని రాసారు, ఇందులో రెండు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితి ఎలా వుంది, ఇప్పుడు మనం ఆచరిస్తున్న వ్యూహం ఏమిటి, భవిష్యత్తులో ఏమి చెయ్యవచ్చు అనే అంశాల పైన పరిశీలన జరిగింది.
ఇలా చదవండి
ఈ పుస్తకాలను చదవవలసిన క్రమం గురించి మాట వస్తే, పైన చెప్పబడిన సీరియల్ నుంబర్ల ప్రకారం పుస్తక పతనం చెయ్యడం మంచిది. మొదట పుస్తకం నిసీద్ హజారీ పుస్తకం అసలు ప్రారంభం లో విభజన సమయం లో జరిగిన అంశాలను చెబుతుంది.
ఇది మొదట చదివితే పారంభం లో జరిగినదంతా తెలుస్తుంది, అది తెలిస్తే మిగితా విషయాలు అర్ధం చేసుకోవడం చాల తేలిక.
నిసీద్ హజారీ పుస్తకం తరువాత టీసీఏ రాఘవన్ పుస్తకం చదవవచ్చు ఇందులో 1947 నుంచి ప్రస్తుత సమయం వరకు రెండు దేశాల మధ్య ఏమి జరిగిందని చెబుతుంది. దీని తరువాత స్టాన్లీ వాల్పర్ట్ రాసిన పుస్తకం, సుమిత్ గాంగూలీ రాసిన పుస్తకం, శరత్ సభర్వాల్ రాసిన పుస్తకం చదవచ్చు.
Also read - Apply for IIT Guwahati launched MTech (Robotics and Artificial Intelligence) till 15 July 2026
- Get link
- X
- Other Apps






Comments
Post a Comment