2026 తమిళనాడు ఎన్నికలు: అయ్యిందా నూతన యుగం ఆరంభం?

Voting

2026 తమిళనాడుకు గుర్తుండిపోయే ఒక సంవత్సరం అని చెప్పుకుపోవచ్చు. దీనికి ఒక కారణం ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఒకటైతే, మరొకటి వచ్చి ఆ ఎన్నికల్లో కనపడ్డ ఫలితాలు. ఈ సారి చాలా మంది ఊహించని విధంగా 2026 ఎన్నికలు దాని ఫలితాలు కొంత భిన్నంగా వచ్చాయి.

తమిళుడు అసెంబ్లీ ఎన్నికలు 23 ఏప్రిల్ 2026 న జరగగా దాని ఫలితాలు 4 మే 2026 న అనౌన్స్ చెయ్యడం జరిగింది. ఈ సరి ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే పాల్గొన్నాయి. భారతీయ జనతా పార్టీ (భాజపా), పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే), కాంగ్రెస్ (ఐఎన్సీ), విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్టు పార్టీ అఫ్ ఇండియా - మార్క్సిస్టు (సీపీఐ - ఎం) కుడా పోటీ చేసాయి. 

ఈసారి మరొక విశేషం 2026 తమిళనాడు ఎన్నికలకు వుంది, ఇందులో తమిళ సినీ హీరో విజయ్ తమిళగ వెట్రి కట్చి (టీవీకే) స్థాపించి ఈ 2026 ఎన్నికల్లో పాల్గొనడం చాలా విశేషం. సాధారణంగా  ఐతే తమిళనాడు ఎలక్షన్స్ అంటేనే ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే, ఐఎన్సీ పేర్లు వినపడతాయి, మరి ఈసారి టీవీకే ప్రధానం గా కనపడటం జరిగింది, ఇదే ఈ ఎలక్షన్స్ కు వున్నపెద్ద హైలైట్ అని సీనియర్ పాత్రికేయులు పీ శివకుమార్ అభిప్రాయ పడ్డారు.

టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే, ఐఎన్సీ పార్టీలు పోటీ చేస్తున్నా, ముఖ్య పోటీ వచ్చేసరికి డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యనే ఉంటుందనీ, విజయం కూడా డీఎంకే లేదా, ఏఐఏడీఎంకే కి మాత్రమే దక్కుతుందని చాలామంది వూహించారు, ఇలా కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో జరుగుతూనే వుంది మరి, 2026 లో కూడా అదే జరుగుతుందని చాలామంది అనుకున్నారు.

కానీ ఇక్కడే తేడా వచ్చింది మరి, ఆలా అందరు అనుకున్నట్లు ఏమాత్రం జరగలేదు, ఎవరూ అనుకోని విధంగా విజయ్ నాయకత్వంలో టీవీకే ఘన విజయం సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఎన్నో ఏళ్ల అనుభవం వున్న ఎలక్షన్ విశ్లేషకులు కుడా ముక్కు మీద వేలు వేసుకునే లా రిజల్ట్స్ వచ్చాయి. ఇది నిజంగానే ఒక అంచనా వేయని విధంగా ఉందని, పీ శివకుమార్ అభిప్రాయపడ్డారు.

మాములుగా ఏఐఏడీఎంకే లేదా డీఎంకే కు ఎక్కువ సీట్లు వచ్చి, టీవీకే మరియు ఇతర పార్టీలకు మాత్రం ఒక 10 నుంచి 30 సీట్లు దక్కవచ్చని భావించడం జరిగిందని, ఇందుకు కారణం ప్రధానంగా ఏఐఏడీఎంకే లేదా డీఎంకే ప్రభావం రాష్ట్రంలో (తమిళనాడులో) ఎక్కువగా ఉండటమే. కానీ ఎవరూ ఊహించని విధంగా టీవీకే కు 108 సీట్లు దక్కాయి, ఇది చాలా పెద్ద విషయం, అని తమిళనాడుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రితేష్ రంజాన్ అభిప్రాయ పడ్డారు.

Voting

సినీ రంగంలో తన సత్తా చాటుకుని, ఒక ప్రముఖ స్థాయికి ఎదిగిన ఒక మూవీ హీరో ఏమాత్రం అనుభవంలేని రాజకీయ రంగంలో ఇలా మొదటి ప్రయత్నంలోనే ఇంత ఘన విజయం సాధించటం సామాన్యమైన విషయం మాత్రం కాదు అని రితేష్ రంజాన్ అన్నారు. రాజకీయానికి సినీ రంగానికి చాలా దెగ్గర పోలికలు ఉన్నట్లు చాలా మందికి అనిపించినా, ఈ రెండు రంగాలకు భూమికీ, ఆకాశానికీ వున్న తేడాలు వున్నాయి. 

ఈ రెండు రంగాల్లో రాణించాలి అంటే వాటికి కావలసిన అర్హతలు వేరు చేయవలసిన కృషి వేరు, సినిమాల్లో విజయం సాధించాము కదా అని రాజకీయాల్లోనూ ప్రాముఖ్యత చాలా తేలికగా పొందవచ్చని అనుకుంటే అది పొరపాటే, అని పీ శివకుమార్ అన్నారు. సినిమాల్లో అంతటా విజయం కైవసం చేసుకొని మరి రాజకీయాల్లో రాణించలేక పోయిన ప్రముఖులు ఎందరో వున్నారు భరతం దేశంలోనూ విదేశాల్లోనూ. 

ఐతే తమిళ సినీ దిగ్గజం విజయ్ ఇందుకు పూర్తి భిన్నంగా నిలిచారు, అతని సక్సెస్ అన్ని రంగాల వారి నుంచి అతనికి ప్రశంసలు తెచ్చి పెడుతున్నది, ఇది అంతా చూసినవారికి రెండు ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి - 2026 ఎలక్షన్స్ లో ఇలా రిజల్ట్స్ భిన్నంగా ఎందుకు వచ్చాయి? మరియు ఇది ఒక కొత్త దశకు లేదా కొత్త ఆలోచనా సరళికి ప్రారంభ సూచకమా ఇది ముందు కాలంలో మరింత బలపడుతుందా?     

మార్పుకు కారం ఏమి అయ్యుంటుంది?

తమిళనాడు లో ఎన్నో దశాబ్దాలు గా డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీల హవా సాగుతున్నది ఐతే ఈసారి అంటే 2026 లో ఇందుకు పూర్తీ భిన్నంగా ఉండటానికి కారణం ప్రజల ఆలోచనల్లో అంటే ముఖ్యంగా రాష్ట్ర యువతలోని ఆలోచన సరళిలో మార్పు రావడం  ఇందుకు ముఖ్య కారణం అయ్యుండవచ్చని సీనియర్ పాత్రికేయులు రితేష్ రంజన్ భావిస్తున్నారు.

పై రెండు ప్రధాన పార్టీలు అధికారంలో వున్నప్పుడు ద్రావిడ పరంపర, ద్రావిడ సంస్కృతి, ద్రావిడ రాజనీతి వంటి విషయాల ఆధారంగా వ్యవహారాలు నడిచేవని రితేష్ అన్నారు, ఈ సరళికి ఇప్పటి తరంలో అంటే ముఖ్యంగా యువతలో పెద్దగా పాపులారిటీ రాలేదని ఆయన అన్నారు. 

Voting

పీ శివకుమార్ కూడా ఇందుకు అంగీకరిస్తూ ఇప్పటి యువత ఆలోచనా సరళిలో మార్పు చాలా వచ్చిందని, వాళ్ళ ఆలోచన సరళికి తగ్గట్లు ఈ పార్టీల వ్యవహారశైలిలో మార్పు అంతగా రాలేదని అందుకే ఇవి అంతగా ప్రజలను ముఖ్యంగా యువతను ఆకట్టుకోలేక పోయుండవచ్చ్చని ఆయన అన్నారు. 

మరి ఇప్పటి యువత రాజకీయాల పైన ప్రజా సమస్యల పైన అవగాహన బానే ఉంది, అది ముందు తరాల వాళ్ళ ఆలోచనలకూ భిన్నంగా ఉండటం నిజమే. ఈ తరం యువతకు రాజకీయాల పైన అంత ఆసక్తి లేక పోవచ్చు కానీ ప్రజా సమస్యలపైనా ఆర్ధిక విధి విధానాల పైన మంచి అవగాహన మాత్రం వుంది. 

బహుశా ఈ జనరేషన్ యూత్ దేశ సమస్యల పట్ట చాలా సీరియస్ గా ఉండటం, పరిపాలన యంత్రాంగం నుంచి చాలా ఎక్సపెక్టేషన్ కుడా ఉంది ఇది నిజం, ఇది పెద్ద విధంగా ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఎంతైనా వుంది. అది అడ్మినిస్ట్రేటివ్  అకౌంటబిలిటీ అయివుండొచ్చు లేదా క్లీన్ గవర్నెన్స్ కావచ్చు, నో కరప్షన్ కావచ్చు వీటి పైన ఇప్పటి యంగ్ జనరేషన్ నో కాంప్రమైజ్ అనే ఆటిట్యూడ్ వుంది ఇది ఇప్పుడు మనం చూస్తున్న మార్పుకు కారణం అయ్యుండచ్చు, ఇది రానున్న కాలంలో మరింత బల పడవచ్చు. 

ముందు కాలం ఎలా ఉంటుంది? 

ఐతే ఇది పెర్మనెంట్ ఛేంజినా లేదా మళ్ళీ మార్పు వుంటుందా అంటే మాత్రం దీనికి చాలా భిన్నమైన సమాధానాలు వెలువడుతున్నాయి.  ముందు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం, తరువాత పరిపాలన మీద ధ్యాస పెట్టడం జరుగుతుందని. పరిపాలన ఎలా వుంటుందనే విషయం పైన భవిష్యత్తులో ఏమి జరుగుతుందన్నది ఆధార పడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీవీకే పెర్ఫార్మన్స్ ఇప్పుడు ఎలా ఉందనేదాని బట్టి భవిష్యత్తులో మళ్ళీ వాళ్లకు పరిపాలన బాధ్యతలు దక్కుతాయా అనేది ఆధారపడివుంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Voting

Also read - IIT Jodhpur gives a big boost to valour and wisdom


Comments